జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి

కర్నూలు(సెంట్రల్‌): జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని ఏపీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌రాజు, ఐజేయూ జాతీయ సమితి సభ్యు లు ఎన్‌.వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోటలో రిపోర్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వి.కోట రిపోర్టర్‌ హత్యకు నిరసనగా డీపీఆర్‌ఓ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌.లెనినిబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై అనేక కథనాలు రాసి వారి హృదయాల్లో స్థానం సంపాదించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అతన్ని శ్రీగంధం మాఫియా దారుణంగా హత్య చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మన్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలన్నారు. నాయకులు చంద్రశేఖర్‌, వైవీ కృష్ణారెడ్డి, కె.శ్రీనివాసగౌడ్‌, కె.నాగరాజు, నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement