రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఇద్దరికి గాయాలు

ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో సతీష్‌ (28) అనే యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిన్నహోతూరు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆస్పరి సీఐ శ్రీనివాసుల నాయక్‌ తెలిపిన వివరాలు మేరకు.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శ్రీనికేత్‌తో పాటు సతీష్‌, సాయకృప అనే యువకులు బళ్లారిలో ఒక శుభకార్యానికి డెకరేషన్‌ వేసేందుకు వెళ్లారు. పని ముగించుకుని మినీ ట్రాలీ వాహనంలో బళ్లారి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని చిన్నహోతూరు గ్రామ సమీపంలో వెనుక నుంచి మినీ ట్రాలీ వాహనం ఢీకొట్టింది. అందులో ఉన్న సతీష్‌ అక్కడికక్కడే మృతి చెండారు. డ్రైవర్‌ శ్రీనికేత్‌, సాయి కృప అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement