భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్‌

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

కర్నూలు (టౌన్‌): భవన నిర్మాణాలకు భారతి సిమెంట్‌ పటిష్టమైందని మార్కెటింగ్‌ మేనేజర్‌ ప్రతాప్‌ రెడ్డి, టెక్నికల్‌ డీజీఎం ఓటుల్‌ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ ప్రెవేట్‌ సమావేశ హాలులో భారతి సిమెంట్‌ ఆధ్వర్యంలో సిమెంట్‌ వినియోగంపై బిల్డర్స్‌ మీట్‌ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. భారతి సిమెంట్‌ రోబోటిక్‌ టెక్నాలజీతో తయారువుతుందని, అల్ట్రాఫాస్ట్‌ నాణ్యతతో కలిగి ఉంటుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం ఉందన్నారు. కార్యక్రమంలో కంపెనీ డిప్యూటీ మేనేజర్‌ ఇక్బాల్‌ బాషా, ఉదయ్‌కిరణ్‌, టెక్నికల్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

మహానందిలో సండే సందడి

మహానంది: సెలవు రోజు కావడంతో ఆదివారం మహానంది ఆలయంలో భక్తుల సందడి కొనసాగింది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం స్థానిక కల్యాణ మండపంలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement