శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల మధ్య బంగారు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులను బంగారు రథం నుంచి ప్రహ్లాదరాయలు ఆశీర్వదించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు నేతృత్వంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామదేవత మంచాలమ్మకు కుంకుమార్చన, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందవనానికి, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు గావించారు. శ్రీమఠం కారిడార్‌లో, కల్పతరు క్యూకాంపెక్స్‌లో, పరిమళ ప్రసాదం కౌంటర్లల్లో, అన్నపూర్ణ భోజనశాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. – మంత్రాలయం


