● ఆయకట్టు రైతుల ఆందోళన
బనగానపల్లె: ఎస్సార్‌బీసీకి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో 58వేల ఎకరాలు ఉండగా రబీలో 12 వేల ఎకరాల్లొ మొక్కజొన్న, 16వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరికొన్ని పంటలను ఇతర విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం వరి వెన్ను, మొక్కజొన్న కంకిదశలో ఉంది. ఈనెల చివరి వరకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలోని మొత్తం పంటలన్నీ చేతికి వచ్చే అవకాశం ఉంది. గోరుకల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ ఎస్బార్‌బీసీకి విడుదల నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మే చివరి వరకు నీటిని ఇచ్చేవారని, ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అర్థకం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు.


