ముగిసిన ఎస్‌ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎస్‌ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కర్నూలు : పోలీసు శాఖలోని ఏఎస్‌ఐలు/హెడ్‌ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న పోలీస్‌ శిక్షణ కళాశాలలో నిర్వహించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం ముగిశాయి. ఔట్‌డోర్‌ పరీక్షల్లో భాగంగా డ్రిల్‌, ఆయుధాలపై పరిజ్ఞానం, నేరస్తుల పరిశీలన వంటి అంశాలపై మౌఖిక పరీక్ష (ఓరల్‌ టెస్టు) నిర్వహించారు. రాయలసీమ జోన్‌ పరిధిలో ఏఎస్‌ఐలు, మొత్తం 72 మంది ఔట్‌ డోర్‌ పరీక్షకు హాజరయ్యారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ షిమూషి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌ దీపిక పాటిల్‌ తదితరులు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. డీటీసీ ప్రిన్సిపాల్‌ హుసేన్‌ పీరా, వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌, డీఎస్పీలు శ్రీనివాసులు, కరీం, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ నందిని, కర్నూలు రేంజ్‌ డీఐజీ కార్యాలయ మేనేజర్‌ రత్నప్రకాష్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement