మహానందిలో అత్యధిక టోల్‌గేట్ వసూలు
రూ. 80 కి బదులు రూ.100 వసూలు
పట్టనట్లు వ్యవహరిస్తున్న దేవస్థాన అధికారులు
మహానంది: మహానంది దేవస్థానంలో టోల్ గేట్ల నిర్వహణ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. దేవస్థానం నిర్ణయించిన అధికారిక ధరల కంటే అత్యధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో టెండర్లను దక్కించుకున్న వారికి లేని తెలివితేటలు తమకు మాత్రమే ఉన్నాయన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రము ఖ పుణ్య క్షేత్రమైన మహానంది ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి సైతం ఇక్కడికి వస్తుంటారు. మహానందిలో మహానంది నుంచి నంద్యాల వెళ్లే మార్గంతో పాటు మహానంది నుంచ గాజులపల్లె వెళ్లే మార్గంలో రెండువైపులా ఉభయ టోల్‌గేట్లు ఏ ర్పాటు చేశారు. గత ఏడాది వీటి నిర్వహణకు వేలాలు నిర్వహించగా రూ. 1,68,00,003 కోట్లు ఆదాయం వచ్చింది. తాజాగా ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.1,91,00,007 ఆదా యం లభించింది. నూతన టెండర్ ధరలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దేవస్థానం నిబంధనల మేరకు జీపు , కారు, ట్రాక్టర్‌ల వంటి నాలుగు చక్రాల వాహనాలకు, ఆటో లకు రూ. 80 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్ దక్కించుకున్న వ్యక్తి అతి తె లివి ప్రదర్శిస్తున్నారు. మహానంది దేవస్థానం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తుఫాన్ వాహనంలో వచ్చే భక్తుల నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారు. ఇందుకోసం సొంతంగా రూ. 80కు బదులు రూ.100 పేరుతో టికెట్లు ముద్రించి వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇలా అనధికార వసూళ్లకు పా ల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దేవస్థానం అధికారులను సంప్రదించగా దేవస్థానం నిబంధనల మేరకు మాత్రమే వసూలు చేయాలని అధిక మొత్తంలో వసూ లు చేస్తే టెండర్‌లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.


