పెళ్లి ఇంట విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇంట విషాదం

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

● విద్యుత్‌ షాక్‌తో వరుడి సోదరుడు మృతి

● విద్యుత్‌ షాక్‌తో వరుడి సోదరుడు మృతి

కొలిమిగుండ్ల:పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై వరుడి సోదరుడు మృతి చెందాడు. మండలంలోని మదనంతపురం గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సుద్దల గంగశివుడు(32) కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. సొంత చిన్నాన్న గంగన్న కుమారుడు పెళ్లి ముహూర్తం కావడంతో బుధవారం పనుల్లో బిజీ అయ్యారు. బంధువులందరూ గ్రామానికి చేరుకున్నారు. ఉదయమే పెళ్లి పందిరి వేయాలని గంగశివుడు బంధువులతో కలిసి ఊరి శివారులోని టెంకాయ చెట్టు వద్దకు వెళ్లాడు. మిగిలిన వాళ్లు కింద ఉండగా ఆ యువకుడు చెట్టు పైకి ఎక్కాడు. చెట్టు పైభాగానే 11 కేవీ విద్యుత్‌ తీగలు ఉండటంతో వాటికి టెంకాయ పట్ట తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై చెట్టుపైనే పడిపోయాడు. నిచ్చెన సాయంతో బంధువులు పైకి ఎక్కి చూడగా అప్పటికే విగత జీవిగా మారిపోయాడు. మృతదేహాన్ని తాళ్ల సాయంతో కిందకు దించారు. పెళ్లి సందడి ఉన్న ఇంట్లో ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయి విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య సరస్వతి, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement