ఎకై ్సజ్‌ ట్రైనీ ఎస్‌ఐలకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ ట్రైనీ ఎస్‌ఐలకు శిక్షణ

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

కర్నూలు: ఎకై ్సజ్‌ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి (ఈఎస్‌) మచ్చా సుధీర్‌బాబు ఎకై ్సజ్‌ ట్రైనీ ఎస్‌ఐల కు సూచించారు. గ్రూప్‌–2 ద్వారా ఎకై ్సజ్‌ శాఖలో ఎస్‌ఐలుగా ఎంపికై న 8 మంది జిల్లాలోని వివిధ ఎకై ్సజ్‌ స్టేషన్లలో ప్రాక్టికల్‌ శిక్షణ పొందుతున్నారు. వారికి మంగళవారం మద్దికెర మండలం సుబ్బరాయుడుపల్లె శివారులోని ఈత వనంలో కల్లు పరిపాలన విధానాల గురించి శిక్షణ ఇచ్చారు. కల్లు దుకాణాల లైసెన్స్‌లలో రకాలు, లైసెన్స్‌దారులకు ఈత వనంలో చెట్ల కేటాయింపు, వాటి నుంచి కల్లు సేకరించే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈత వనం సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, కొత్త లైసెన్స్‌లు జారీ చేసేటప్పుడు తీసుకోవలసిన చర్యలు, కల్లు దుకాణాల లైసెన్స్‌ రెన్యువల్‌ విధానం, కల్తీ కల్లు అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు, కల్తీ కల్లు గుర్తించే విధానం తదితర వాటి గురించి ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చారు. ఎకై ్సజ్‌ చట్టాలు, అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై దాడులు, కేసుల నమోదు తదితర అంశాలపై ఎకై ్సజ్‌ ఎస్‌ఐల పర్యవేక్షణలో వారం రోజులుగా శిక్షణ పొందారు. ఇందులో భాగంగా శిక్షణ అభ్యర్థులకు ఈత చెట్లు గీసే విధానం గూర్చి కల్లు దుకాణాల లైసెన్స్‌దారుల చేత ఆచరణాత్మకంగా చూపించారు. ఏఈఎస్‌ రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్‌, రాజేంద్రప్ర సాద్‌, స్వర్ణలత, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రెహన, రాజేష్‌తో పాటు జిల్లాకు కేటాయించిన ఏడుగురు శిక్షణ ఎకై ్స జ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement