కర్నూలు కల్చరల్: కళావాహిని సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. అల్లూరి సీతారామ రాజు ఏకపాత్రాభినయం, శ్రీకృష్ణ పడక సీను, సత్య హరిశ్చంద్ర అడవి సీను పాత్రలను కళాకారులు శీలం రోషన్న, బెల్డోన కృష్ణమూర్తి, నాగశేషయ్య, దాగంటి శ్రీనివాస్, నారాయణస్వామి నాయుడు, నాగేశ్వరరావు, అరుణ పోషించి అలరించారు. సంస్థ అధ్యక్షుడు మనోహర్‌బాబు అఽధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ధనుంజయ, పీజీ వెంకటేశ్వర్లు, మారెన్న, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


