దేశం సుధాకర్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

దేశం సుధాకర్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

ఆరోగ్య కేంద్రాల్లో 65 పరీక్షలు చేయాలి కర్నూలు(హాస్పిటల్‌): పట్టణ ఆరోగ్య కేంద్రా లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ 65 పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై. కామేశ్వరప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని ఓల్డ్‌ క్లినికల్‌ లెక్చరర్‌ గ్యాలరీలో మలేరియా ల్యాబ్‌ టెక్నీషియన్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ ఆరోగ్య కేంద్రాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సమ యం ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపా రు. హెచ్‌ఐవీకి సంబంధించి రికార్డుల నిర్వహణ సరిగ్గా చేయాలన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌ సర్వెలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విశ్వేశ్వరరెడ్డి, ఎన్‌ఎంఓ డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పాల్గొన్నారు.

నంద్యాల: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య దర్శి దేశం సుధాకర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యా హ్నం ఫోన్‌లో పరామర్శించారు. పది రోజుల క్రితం ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో బైక్‌ ప్రమాదంలో గాయపడిన దేశం సుధాకర్‌రెడ్డి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి శనివారం దేశం సుధాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రమాదం ఎలా జరిగింది, వైద్య చికిత్స తదితర వివరాలు అడిగి తెలుసుకున్నా రు. డాక్టర్లు చెప్పిన విధంగా సమయానికి మందులు వాడుతూ.. తగిన విశ్రాంతి తీసు కోవా లని సూచించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని, త్వరగా కోలుకోవాలని కోరారు.

7న ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా

కర్నూలు(సెంట్రల్‌): జిల్లా ఉపాధి కార్యాల యంలో ఈనెల 7వ తేది ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి.దీప్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాకు ఎనోవిజన్‌, జీపీఎస్‌ పునరుత్పాదక ఎనర్జీ, బ్లూ స్టార్‌, అంబర్‌ తదితర కంపెనీలు హాజరై ప్రొ డక్షన్‌ ఆపరేటర్లు, మెషిన్‌ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, టెలీ కాలర్‌ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పది ఆపై విద్యార్హత కలిగిన యువతీ,యువకులు జాబ్‌ మేళాకు హాజరు కావాలని, మరిన్ని వివరాలకు www. ncs. gov. in, www. employ ment. ap.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

నిరాశతో వెనుదిరిగిన విద్యార్థులు

కర్నూలు సిటీ: ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు ఈ నెల 2వ తేది నుంచి ప్రారంభమయ్యాయి. నగర శివారులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శనివారం జరిగిన పరీక్షలకు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. అయితే, అప్పటికే కేంద్రంలోకి అనుమతించే సమయం ముగిసిపోవడంతో వారిని లోపలికి పంపలేదు. దీంతో ఆ నలుగురు విద్యార్థులు పరీక్ష రాయకుండా నిరాశతో వెనుదిరిగిపోయారు.

అంకితభావంతో

పనిచేస్తే విజయం సాధ్యం

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే విజయం సాధ్యమవుతుందని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌ అన్నారు. అందరి సమిష్టి సహకారం, కృషితో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 90 శాతం పన్నుల వసూలు సాధ్యమైందన్నారు. పన్నుల వసూలులో లక్ష్యాన్ని సాధించడం పట్ల శనివారం జిల్లాకు చెందిన డివిజినల్‌ పంచాయతీ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు డీపీఓ భాస్కర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు, ఆదోని డీఎల్‌పీఓలు టి. లక్ష్మి, తిమ్మక్క, డిప్యూటీ ఎంపీడీఓ లు ఈశ్వరయ్య స్వామి, నరసింహులు, నాగేష్‌, కిషోర్‌, జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలి

ఆలూరు: ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో శనివారం ఆలూరు క్లస్టర్‌ హార్టికల్చర్‌ అధికారిణి ఇందిర ఆధ్వర్యంలో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి జిల్లాలో పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం తక్కువ నీటితో ఆకుకూరలు, కూరగాయాలు, గోరుచిక్కుడు, బెండ, వంకాయలను సాగుచేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్‌, సబ్సి డీ ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement