తన్నుల సేవలో తరించి.. వీరభద్రుడి మొక్కులు తీర్చి! | - | Sakshi
Sakshi News home page

తన్నుల సేవలో తరించి.. వీరభద్రుడి మొక్కులు తీర్చి!

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

చిన్నహోతూరులో శనివారం నిర్వహించిన సిద్ధరామేశ్వర స్వామి వసంతోత్సవంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం, కుడుముల ఆట, నందికోలు, వీరభద్రస్వామి తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి వీరభద్రస్వామి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటూ భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. వసంతోత్సవంలో భాగంగా గ్రామంలో కులమతాలకు ఆతీతంగా ప్రజలందరూ గులాబీ రంగు వినియోగించడంతో గ్రామం గులాబీ రంగు మయమైంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగు వేసుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు. – ఆస్పరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement