మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట | - | Sakshi
Sakshi News home page

మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట

బేతంచెర్ల: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించడానికి తరలిరావడంతో మద్దిలేటయ్య నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఉప కమిషనర్‌ రామాంజనేయులు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement