పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. ఆనందంగా ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోగా అక్కడి పరిస్థితిని చూసి నివ్వెరపోయారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు, మరోవైపు పల్లెల్లో బంధువుల వివాహాలకు వెళ్లే ప్రయాణికులు, ఇంకోవైపు ఊర్లలో జాతర్లకు వెళ్లే బంధువులతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోతుండటంతో రెండు మూడు గంటలపాటు వేచి చూసిన ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఇలాగైతే ఇళ్లకు చేరుకోలేమనుకొని వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతూ కిటికీల్లోంచి దూరడం, వస్తువులను సీట్లలో పెట్టడం చేస్తూ పలు అగచాట్లు పడ్డారు. ఎలాగోలా సీట్లు పట్టుకున్న వారు కూర్చొని ప్రయాణించగా మిగతావారు కిక్కిరిసిన బస్సులో ఉక్కపోతతో అల్లాడుతూ అలాగే ప్రయాణించారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కర్నూలు బస్టాండు నుంచి పదో తరగతి పరీక్షలు ముగిసిన వేళ అదనపు బస్సులు కల్పించలేరా? అంటూ ప్రయాణికులు నిట్టూర్చారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
పాపను కీటికీ నుంచి సీట్లోకి తోసేద్దాం..


