కర్నూలు(హాస్పిటల్): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ‘కార్డియో స్లీవ్’ వ్యాలిడేషన్ పరీక్షల్లో భాగంగా 30 సెకన్లలోనే గుండె వైఫల్యాలను గుర్తించి నివేదికలు ఇస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. గురువారం ఆసుపత్రిలో ‘రిజువెన్ మెడికేర్’ ఏఐ వ్యాలిడేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వచ్చిన 300 దరఖాస్తులలో 18 వినూత్న కంపెనీలను ఎంపిక చేశారన్నారు. ఆ జాబితాలో రిజువెన్ మెడికేర్ ఇండియా సంస్థ వారి కార్డియో స్లీవ్ పరికరం పనితీరు పరీక్షించినట్లు చెప్పారు. ఈ పరికరం ద్వారా 30 సెకన్లలోనే గుండె సమస్యలను 93 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చన్నారు. కార్డియాలజీ డాక్టర్లు ప్రశాంత్, కె.రవికిరణ్, రిజువెన్ సంస్థ ప్రతినిధులు బాలాజి లంక, ఉమా మహేష్ కట్టా, శాంతి పచ్చిపాల పాల్గొన్నారు.
జీసస్ అక్షరాలతో యేసు చిత్రం
నంద్యాల(వ్యవసాయం): పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు గుడ్‌ఫ్రైడే పురస్కరించుకొని జీసెస్ అక్షరాలతో మైక్రో ఆర్ట్ చిత్రాన్ని గురువారం చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. జీసెస్ పేరులోని అక్షరాలతో చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు.


