గ్యాస్ వినియోగదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సిలిండర్ల కోసం పనులు మానుకుని ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. మంగళవారం మండల కేంద్రం హొళగుందలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల సరఫరా చేపట్టారు. ఆదోని నుంచి గ్యాస్ బండి వచ్చిందనే సమాచారంతో వినియోగదారులు సిలిండర్లతో బారులుదీరారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో విలవిలాడుతూ గంటల తరబడి వేచి ఉన్నా చివరకు సిలిండర్లు ఇవ్వలేదు. ఈనెల 21వ తేదీ లోపు మాత్రమే బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొందరు వాగ్వాదానికి దిగారు. చాలా మంది చివరకు ఖాళీ సిలిండర్లతో వెనుదిరగాల్సి వచ్చింది.
– హొళగుంద


