డోన్‌లో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

డోన్‌లో దొంగల హల్‌చల్‌

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

డోన్‌ టౌన్‌: పట్టణంలోని శ్రీనివాస నగర్‌లో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల్లో ఒకరు స్థానికులకు పట్టుబడ్డారు. సోమ వారం రాత్రి దుండగులు చైన్‌స్నాచింగ్‌కు యత్నించగా మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. నిందితులు మోటార్‌ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. పట్టుబడిన యువకుడు కర్నూలు పట్టణం బుధవారపేటకు చెందిన అబ్దుల్‌ కరీంగా పోలీసుల విచారణలో తెలిసింది. పరారైన ముగ్గురు నిందితులపై గతంలో బండిఆత్మకూర్‌, నంద్యాల, పాణ్యం, నందికోట్కూ రు, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పట్టుబడిన అబ్దుల్‌ కరీంపై తెలంగాణ రాష్ట్రం గద్వాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు అప్పజెప్పి, పరారైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement