పాణ్యం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాణ్యంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఖలీల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన గని గోపాల్‌రెడ్డి (45), భార్య లక్ష్మీదేవి మధ్య గొడవ జరగడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గోపాల్‌రెడ్డి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పాణ్యంలోని తాటికాయ చెరువు వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఉదయం ట్రాక్‌ను పరిశీలించిన సిబ్బంది మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి కుమారుడు భీష్మరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.


