కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు

Feb 23 2026 6:57 AM | Updated on Feb 23 2026 6:57 AM

కుక్క

కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు

గుత్తి రూరల్‌: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెరువు తండాకు చెందిన చరణ్‌ నాయక్‌ అనే బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామానికి చెందిన సరోజ, హనుమంతునాయక్‌ దంపతుల కుమారుడు చరణ్‌ నాయక్‌ ఆదివారం ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క విచక్షణరహితంగా దాడి చేసింది. కింద పడిన చరణ్‌నాయక్‌ మొహంపై కాటు వేయడంతో తీవ్ర రక్త గాయమైంది. అతన్ని కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అలాగే కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన అనిల్‌, తుగ్గలి మండలం మిద్దె తండాకు చెందిన చరిష్మా, నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన శివకుమార్‌ కూడా కుక్కకాట్లతో ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. ఆదివారం ఒక్క రోజే వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది కుక్కకాటు బాధితులు గుత్తి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం గమనార్హం.

బావిలో పడి బాలుడి మృతి

అవుకు(కొలిమిగుండ్ల): ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి..అవుకు మండలంలోని సంగ పట్నంకు చెందిన సాకే మహేంద్ర, లక్ష్మీ గుర్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు రుషికేశవ్‌(8) అవుకు పట్టణంలోని ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ అభ్యసిస్తున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో సాయంత్రం తమ్ముడితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దగ్గర్లో ఉన్న బావి వద్దకు వెళ్లే సరికి కాలు మడత పడి ప్రమాద వశాత్తూ అందులో పడిపోయాడు. గమనించిన తమ్ముడు పరుగున ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన చేరుకున్నారు. బావి లో దిగి బాలుడిని పైకి తీసి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

విద్యుత్‌ తీగల చోరీకి యత్నం

పాములపాడు: మద్దూరు గ్రామ పంచాయతీ క్రిష్ణానగర్‌ గ్రామం వద్ద ఎస్సార్‌బీసీ కాల్వ వెంట ఉన్న విద్యుత్‌ మోటార్ల తీగలు అపహరిస్తున్న ముగ్గురు దొంగలను రైతులు పట్టుకున్నారు. సురేంద్ర అనే యువకుడు చేపలు పడుతున్నట్లుగా కాల్వ వెంట పుట్టీలో వలతో వస్తున్నాడు. ఇద్దరు మైనర్లు కాల్వ గట్టు పై ఉన్న వైర్లు కట్‌ చేస్తూ ఉన్నారు. పగలు కరెంటు ఉండటంతో రైతులు పొలాలకు నీరు మళ్లీస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా నీరు సరఫరా ఆగిపోవడంతో మోటారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నాలుగు మోటార్ల విద్యుత్‌ వైర్లను కట్‌ చేసినట్లు రైతులు గమనించారు. వెంబడించి ముగ్గురిని పట్టుకొని గ్రామంలో కట్టిపడేశారు. ఆ ముగ్గురు కూడా పాములపాడుకు చెందిన వారని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించారు.

సెలవు రోజూ

విశ్రాంతి లేదాయే!

జూపాడుబంగ్లా: వారానికోరోజు సెలవు దినమైన ఆదివారం కూడా రెస్టు తీసుకొనే అవకాశం లేకుండా పోయిందని అధికారులు పెదవివిరుస్తున్నా రు. 80 బన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం తాగునీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకు ప్రారంభించే కార్యక్రమం నిర్వహించటంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం గ్రామంలో గోకులంషెడ్డు, ఓవర్‌హెడ్‌ ట్యాంకు ప్రారంభోత్సవం, సిమెంటు రోడ్డు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయితే గోకు లం షెడ్డు ప్రారంభం నిర్వహించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఓవర్‌హెడ్‌ ట్యాంకును ప్రారంభించకుండానే వెనుదిరిగారు. అయితే ఏర్పాట్లు చేసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, కాంట్రాక్టర్‌, అధికారులు, పార్టీ కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. తీరా ఆదివారం సాయంత్రం ట్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు హడావుడిగా 80 బన్నూరు గ్రామానికి చేరుకొని మళ్లీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదుగంటలకు ట్యాంకును ఎమ్మెల్యే జయసూర్య, మాండ్రశివానందరెడ్డి ప్రారంభించారు.

కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు 1
1/1

కుక్కకాటుతో బాలుడికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement