వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కాశన్న
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎంసీ కాశన్న నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్న ఈయన ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న రవిప్రకాశ్‌రావు కొన్ని నెలల కిత్రమే పదవీ విరమణ చేశారు. ఈ స్థానాన్ని భర్తీ చేయలేదు. తాజాగా ఆదివారం కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తాత్కాలికంగా (అడ్‌హక్) ఎంసీ కాశన్నను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న మహేంద్రబాబు కార్యదర్శిగా ఎంపికయ్యారు. తాత్కాలిక ఎన్నిక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం సెక్రటరీ రవికుమార్, ఉపాధ్యక్షుడు ఆడమ్‌ఖాన్ పర్యవేక్షించారు. వ్యవసాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


