బందాని గుట్ట కబ్జా!
వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోట గ్రామంలో బందాని గుట్టపై కన్నేసిన గ్రామస్తుడు శనివారం రాత్రికి రాత్రి 9 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేయించాడు. గుట్టపై సర్వే నంబరు 23లో 31.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా పేదలకు డీ పట్టా ఇచ్చినది 1.88 ఎకరాలు పోను మిగిలిన దాంట్లో హిటాచి, ట్రాక్టర్లను ఉపయోగించి అక్రమార్కుడు పనులు చేయిస్తున్నాడు. ఆదివారం విషయం తెలుసుకున్న గ్రామ వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు వీఆర్‌ఏల ద్వారా పనులు ఆపించారు. అయితే యంత్రాలు, ట్రాక్టర్లు గుట్టపైనే ఉండడంపై ఇటు గ్రామ, మండల అధికారులు, పాలకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.


