మాల్గోవ బలోపేతానికి కృషి
● తొలి డైరీని ఆవిష్కరించిన నేతలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవ)ను బలోపేతం చేసేందు కు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మాల్గోవ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. సోమన్న, డాక్టర్ వై. రాజశేఖర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాల్గోవ ఆధ్వర్యంలో తొలిసారి ముద్రించిన 2026 డైరీని మాల్గోవ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోన నాగరాజు, అడిషనల్ జనరల్ సెక్రటరీ హెచ్‌డీ ఈరన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... మాల్గోవ ప్రారంభించినప్పటి నుంచి మాల గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర నాయకత్వం ముందున్నదన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు చెప్పారు. ఇంకా అసోసియేషన్‌లో లేని వారు వెంటనే మాల్గోవలో సభ్యత్వం తీసుకొని అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అదనపు కార్యదర్శి రాగప్ప, ఉపాధ్యక్షుడు పి. సుధాకర్, మహిళా విభాగం కార్యదర్శి ఏ విజయకుమారి, నాయకులు జి. ధనిబాబు, ఎం ఈశ్వరయ్య, ఏ ఆదిత్య, వినోద్‌కుమార్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.


