లక్ష్మమ్మవ్వ సన్నిధిలో హైకోర్టు జడ్జి
ఆదోని అర్బన్: శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వను ఆదివారం సాయంత్రం హైకోర్టు జడ్జి కె.శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయచో టి సుబ్బయ్య, ఆర్.విశ్వనాథం పూర్ణకుంభంతో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మహాయోగి లక్ష్మమ్మవ్వ వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు జడ్జి వెంట ఆదోని రెండో అదనపు జిల్లా జడ్జి పి.జె.సుధ, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.లీలాసాయి సుభాష్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అర్చన ఉన్నారు.
ఏఆర్ ఏఎస్పీకి
ఎంఎస్‌ఎం అవార్డు
కర్నూలు: కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సింగాల కృష్ణమోహన్‌కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పోలీస్ అధికారులకు ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పోలీస్ మెడల్ ఫర్ మెరిటోయస్(ఎంఎస్‌ఎం) సర్వీస్ అవార్డు దక్కింది. ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఈ మేరకు ఆయనకు చోటు లభించింది.
ఆర్‌ఎస్‌ఐ నుంచి..
కృష్ణమోహన్ ఆర్‌ఎస్‌ఐ హోదాలో 1991లో పోలీస్ శాఖలో చేరారు. ఆర్‌ఐగా 2000లో, డీఎస్పీగా 2011లో, 2024లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. స్పెషల్ పార్టీ కూంబింగ్ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర పోషించారు. 2009లో కర్నూలుకు వచ్చిన వరదల సందర్భంగా నెలరోజుల పాటు సేవలందించి అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఒక సేవాపతకం, ఉత్తమ సేవా పతకం, డీజీ మెడల్, 60 ప్రశంసాపత్రాలు, 50కి పైగా గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డులను ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు.
సైబర్ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి
● ఖాతాలో రూ.14.29 లక్షలు మాయం
పాణ్యం: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాతాల్లో డబ్బులుంటే క్షణాల్లో ఊడ్చేస్తున్నారు. మండల కేంద్రమైన పాణ్యం గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.29 లక్షలను స్మార్ట్‌గా దోచేశారు. పాణ్యం ఏఆర్ కాలనీలో నివాసమున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి అల్లాబకాష్ ఈనెల 23వ తేదీన ‘పెన్షన్ రావాలంటే అడిగే వివరాలు చెప్పిండి’ అంటూ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. దీంతో బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పారు. సైబర్ నేరగాళ్లు పంపిన 10 డిజిట్ నంబర్లను ఏటీఎంలో నమోదు చేసిన కొద్ది క్షణాలకే అతని ఖాతాలో రూ.14,29,500 మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
లక్ష్మమ్మవ్వ సన్నిధిలో హైకోర్టు జడ్జి


