అంతులేని జాప్యం
రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అంతంతమాత్రం వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అంతులేని జాప్యం జరిగింది. ప్రభుత్వం చొరువ తీసుకొని రైతులు, మహిళల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.
– బీమానాయక్, మీటే తండా,
తుగ్గలి మండలం
చంద్రబాబు పాలనలో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకునే లింకేజీ రుణాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టడం దారుణం. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని మభ్య పెట్టారు. ఇప్పటి వరకు తూతూమంత్రంగా ఒక్క సిలిండరు మాత్రమే ఇచ్చారు.
– పి.లక్ష్మిదేవి, మాజీ మండల సమాఖ్య
అధ్యక్షురాలు, బేతంచెర్ల మండలం
సంక్షేమ పథకాల ఊసే లేకపోవడంతో మహిళల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకపోయారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారు. స్వయంసహాయక సంఘాల మహిళలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు.
– చిట్టెమ్మ, మాజీ మండల సమాఖ్య
అధ్యక్షురాలు, కల్లూరు మండలం
అంతులేని జాప్యం
అంతులేని జాప్యం


