లక్షలాది పాదాలు కదంతొక్కాయి.. వేల పిడికిళ్లు బిగించాయి.
కర్నూలులో ర్యాలీ నిర్వహించేందుకు భారీగా తరలివచ్చిన జనం
భారీగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు
కర్నూలులో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రామక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే మణీ గాంధీ, పార్టీ నగర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారయణమ్మ, పార్టీ నేతలు వంగాల భరత్ కుమార్ రెడ్డి, షరీఫ్, కిషన్, రాఘవేంద్ర నాయుడు, బూసినె శ్రీరాములు, బుట్టా నీలకంఠం, పురుషోత్తం రెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, విశ్వ నాథ్ రెడ్డి, ఫయాజ్ అహ్మద్, విద్యార్థి సంఘం నాయకులు రెడ్డిపోగు ప్రశాంత్, కటిక గౌతం, కార్పొరేటర్లు యూసుఫ్ బాషా, జుబేర్, షేక్ అహమ్మద్, రాజేశ్వర రెడ్డి, శ్రీనివాసరావు,రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, ఫిరోజ్, లాజరస్, నవీన్, సువర్ణా రెడ్డి, న్యాయవాదులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం కర్నూలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీగా ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజా సంతకాల సేకరణ బాక్సులను కర్నూలులోని ఎస్‌టీబీసీ కళాశాల నుంచి విజయవాడకు తరలించారు. కర్నూలులోని ఐదు రోడ్ల కూడలి నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ సాగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు, న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి
‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు.
ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి
రాజ్‌విహార్‌లోని ఆర్టీసీ పాత డిపో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాలో రెండు నెలలుగా ఆకుంఠిత దీక్షతో కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా సాగిందన్నారు. పేద విద్యార్థులు సైతం వైద్యులుగా రాణించాలన్న ఉద్దేశంతో జగనన్న ఒకేసారి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. భవన నిర్మాణాలకు రూ.8,500 కోట్లు కేటాయించారన్నారు. రెండు పూర్తి కాగా మిగతా కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ వైద్య కళాశాలలను కొట్టేసేందుకు చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ జపం చేస్తోందని ఆరోపించారు. ప్రజా స్పందనను చూసైనా ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 4 లక్షల 3 వేల సంతకాలలను ఈనెల 18న గవర్నర్‌కు జగనన్న అందిస్తారన్నారు.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఉద్యమానికి విద్యార్థులు, యువత అండగా నిలిచారన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో 50 వేలకు పైగా సంతకాలతో ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకించారన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం
కదం తొక్కిన ప్రజలు
కర్నూలులో పెల్లుబికిన
కోటి సంతకాల ఉద్యమం
ర్యాలీలో భారీగా పాల్గొన్న
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు
ప్రజా వ్యతిరేక విధానాలపై
హోరెత్తిన నినాదాలు
విజయవాడకు ప్రజల సంతకాల
బాక్సుల తరలింపు
ప్రైవేటీకరణను విరమించుకోవాలన్న
వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రజల తరఫున పోరాటం
ఆగబోదని హెచ్చరిక
లక్షలాది పాదాలు కదంతొక్కాయి.. వేల పిడికిళ్లు బిగించాయి.
లక్షలాది పాదాలు కదంతొక్కాయి.. వేల పిడికిళ్లు బిగించాయి.


