అక్రమంగా తరలిస్తున్న వెదుర్లు స్వాధీనం
బండి ఆత్మకూరు: ఎస్‌ఆర్ కుంట సెక్షన్ పరిధిలో నల్లమల నుంచి అక్రమంగా తరలిస్తున్న వెదర్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెదురులు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని, ఆరు సైకిళ్లను పట్టుకున్నారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయంలో శనివారం రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంత గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తుండగా నారాయణపురం గ్రామం నుంచి అక్రమంగా వెదురు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి వెంబడించారు. పరమటూరు గ్రామం వద్దకు వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసు కుని గాజులపల్లి డిపోకు తరలించారు. అంతేకాక శనివారం మధ్యా హ్నం ఓంకారం నార్త్ బీట్ పరిధిలో వెదుర్లు తరలిస్తున్న ఆరు సైకిళ్లను పట్టుకుని సీజ్ చేశారు. అడవి నుంచి అక్రమంగా కలప రవాణా చేస్తే అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీసర్ నాసిర్ ఝా హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రత్నప్రభ, ఎఫ్‌ఎస్‌ఓ నాగేంద్రయ్య, జీసీపాలెం ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, ఓంకారం నార్త్ బీట్ ఎఫ్‌బీఓ. హైమావతిలు పాల్గొన్నారు.


