హంద్రీ–నీవా కాల్వలో గుర్తు తెలియని మృతదేహం
కోడుమూరు రూరల్: లద్దగిరి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాల్వలో శుక్రవారం 30 సంవ త్సరాలు పైబడ్డ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కోడుమూరు పోలీసులు గుర్తించా రు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా తయా రైంది.కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవ్వరైనా చంపి కాల్వలో పడవేశారా అన్న కోణంలో కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోని జిల్లా సాధనకు
పోరాడుదాం
ఎమ్మిగనూరుటౌన్/మంత్రాలయం: ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసి పోరాడుదామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధనకై ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్‌ఆర్ సర్కిల్, మంత్రాలయంలలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు నిర్వహి స్తున్నారు. దీక్షలో కూర్చున్న వారికి శుక్రవారం పలు ప్రజాసంఘాల నాయకులతో పాటు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంతకుమునుపు పట్టణంలో ఆదోని జిల్లా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదోని జిల్లా ఏర్పాటుపై మీకు ఏమైనా విషయం హమీ ఇచ్చామా అని స్థానిక నాయకులతో చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, హంద్రీనీవా, గుండ్రేవుల,వేదావతి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై ఏమి చేశారని నిలదీశారు. రెండవ ముంబైగా పిలవబడే ఆదోనిని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయని తెలిపారు.దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు శేఖర్‌నాయుడు, ఉదయ్, ఖాజ, కృష్ణ, ఆఫ్రిది, రఘు తదితరులకు సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, రాజీవ్, బీజేపీ నాయకులు దయాసాగర్, లలిత్‌జైన్, బీఎల్ నారాయణ, ఎంఈఎఫ్ నాయకులు తిమ్మరాజు, ఆర్‌వీపీఎస్ నాయకులు నల్లారెడ్డి మాట్లాడారు.


