సి.క్యాంపు రైతుబజారు విస్తరణ | - | Sakshi
Sakshi News home page

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ

Dec 13 2025 7:35 AM | Updated on Dec 13 2025 7:35 AM

సి.క్

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ

కర్నూలు (అగ్రికల్చర్‌): కర్నూలు సి.క్యాంపు రైతుబజారు విస్తరణకు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడున్న రైతుబజారు పక్కన ఆర్‌అండ్‌బీ క్వార్టర్ల ప్రదేశంలో జిప్లస్‌ తరహాలో నూతన రైతుబజారును అభివృద్ధి చేస్తారు. గ్రౌండ్‌ప్లోర్‌లో పార్కింగ్‌, పైన 135 స్టాళ్లు, 35 షాపులు నిర్మిస్తారు. కాంపౌండ్‌ వాల్‌కు బదులుగా షాపు లు వస్తాయి. షాపుల్లో రెండు అన్న క్యాంటీన్‌కు వినియోగిస్తారు. రైతుబజారు విస్తరణకు నిధులు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నెంబరు 1067 జారీ అయింది. దీనిపై మార్కెటింగ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

రైలు కింద పడి

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

ఆదోని అర్బన్‌: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన లక్ష్మన్న(60) అనే లారీ డ్రైవర్‌ రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శివరామయ్య, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లారీ డ్రైవర్‌ లక్ష్మన్న శుక్రవారం బుడ్లపొట్టుతో ఆదోని నుంచి నాగలదిన్నెకు ఆరుగురు కూలీలతో బయలుదేరాడు. బైచిగేరి సమీపంలో ఎదురుగా వస్తున్న పత్తి వాహనాన్ని తప్పించబోగా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న సుంకన్న, రంగన్న, హనుమంతు, సూరి, దూలయ్య, అంజిలకు గాయాలయ్యాయి. దీంతో భయపడిపోయిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ–బెంగళూరుకు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గాయాలపాలైన ఆరుగురిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఉరుకుందప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

వసతి గృహ సంక్షేమాధికారులు స్థానికంగా లేకుంటే చర్యలు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి సిబ్బంది తాము పనిచేస్తున్న వసతి గృహాలకు స్థానికంగా నివాసం ఉండాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక హెచ్చ రించారు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు స్థానికంగా ఉంటే విద్యార్థుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం స్థానిక సంక్షేమభవన్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని ఏఎస్‌డబ్ల్యూఓ, హెచ్‌డబ్ల్యూఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రేరణ తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. రక్షిత మంచి నీటిని విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె. బాబు, ఎస్‌ లీలావతి, బి.మద్దిలేటి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికారం వైపు

అడుగులు వేయాలి

కొలిమిగుండ్ల: ఎస్సీ, ఎస్టీలు మరింత చైతన్యవంతులై రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్‌కుమార్‌ అన్నా రు. కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వంకదారి చిన్నచెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వటాల సమీపంలో ఏర్పాటైన రామ్‌కో సిమెంట్‌ కంపెనీ ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. భూములను రక్షించేందుకు హైకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకదారి రవికుమార్‌, జైభీమ్‌ పార్టీ నాయకులు,కల్వటాల గ్రామ పెద్దలు కామిని ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సొమ్ముతో పవన్‌ చక్కర్లు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రజా సొమ్ముతో హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని జడా శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. షూటింగ్‌లు, ఫంక్షన్‌ లు అంటూ రోజూ విజయవాడ – హైదరాబాదు కు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నారన్నారు. సొంత డబ్బులతో హెలికాప్టర్లలో ఎన్ని సార్లు తిరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదని హితువు పలికారు.

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ 1
1/2

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ 2
2/2

సి.క్యాంపు రైతుబజారు విస్తరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement