వేర్వేరు చోట్ల అదుపు తప్పిన కార్లు
అవుకు(కొలిమిగుండ్ల): ఉప్పలపాడు ఆర్చీ సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి ప క్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల నుంచి తాడిపత్రికి వెళుతున్న కారు అవుకు దాటాక ఆర్చీ సమీపానికి చేరుకోగానే ఎదురు గా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పడంతో పక్కనే ఉన్న వరిపొలాల్లోకి వెళ్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయట పడ్డారు. వరి కోత పనుల్లో ఉన్న కూలీలు అక్కడికి చేరుకొని బోల్తా పడిన కారును పైకి లేపారు. అలాగే గుండ్ల శింగవరం సమీపంలో బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళుతున్న జీపు బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయట పడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పాములపాడు: కర్నూలు – ఆత్మకూ రు రహదారిపై ఎర్రగూడూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భానుముక్కల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, బలరాములు కారులో కర్నూలు వెళ్తుండగా అదే సమయంలో ఎర్రగూడూరు గ్రామానికి చెందిన హరి బైక్‌పై వెళ్తూ యూటర్న్ వద్ద క్రాస్ చేస్తుండగా కారు ఢీకొంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్క గొయ్యిలో పడింది. తీవ్ర గాయాలైన హరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
వేర్వేరు చోట్ల అదుపు తప్పిన కార్లు


