పీఎం జేఏవై ద్వారా పేదలకు ఉచిత వైద్యం
కర్నూలు: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం జేఏవై) ద్వారా ఆర్థికంగా నిరుపేదలైన వారికి ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చ య్యే ఉచిత ఆరోగ్య చికిత్సలు పొందవచ్చని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.శుక్రవారం కర్నూలు కొత్తపేటలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లీలా వెంకటశేషాద్రి హాజరై మాట్లాడారు. పీఎం జన ఆరోగ్య యోజన పథ కం ద్వారా లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలు నగదు రహితంగా అందిస్తుందని తెలిపారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ పథకానికి పదహారేళ్ల వయస్సు నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రోజూవారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్నవారు, నిర్మాణ కూలీలు, పెయింటర్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు లబ్ధి పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మాట్లా డుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, తర్వాత వారు హెల్త్ కేర్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ యోజన టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ 14555, 1800 111 565కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి


