హైకోర్టు జడ్జిని కలసిన కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): కర్నూలు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కలిశారు. శుక్రవారం ఆమె రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆయనను కలుసుకొని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ జడ్జికి వివరించారు.
మద్యం మత్తులోనే ప్రమాదాలు
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు తనిఖీలు విస్తృతం చేశామని పేర్కొన్నారు. అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తున్నారని, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా రోజూ కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
లోక రక్షకుడు క్రీస్తు
కర్నూలు(సెంట్రల్): మానవుల రక్షణ కోసం ఏసుక్రీస్తు భూమికి వచ్చిన సందర్భమే క్రిస్మస్ వేడుక అని దైవజనులు డాక్టర్ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఎస్టీబీసీ కళాళాల మైదానంలో కల్వరి గారండ్‌క్రిస్మస్ వేడుకలు వేలాది మంది క్రైస్తవుల మధ్య జరిగాయి. కార్యక్రమానికి హైదరాబాద్‌కుచెందిన డాక్టర్ సతీస్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యేసుక్రీస్తు రాకపై తన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్‌ఆర్‌డీ సజీవరాజు, డాకటర్ ఆర్,దాస్, అమ్రోజ్, రామాంజనేయులు తదితరులు తమ సందేశాలను ఇచ్చారు.
నందికొట్కూరు: జాతీయ స్థాయిలో విశ్వసనీయమైన గణంకాల తయారీకి క్షేత్రస్థాయి సర్వేలు చాలా కీలకమని నేషనల్ స్టాటిస్టిక్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వేను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చేపట్టిన గణంకాల కార్యక్రమం ఎంత ఉపయోగమన్నారు. ఈ సర్వే దేశ వ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగిత రేట్లను అంచనా వేయడానికి ఎన్‌ఎస్‌ఓ సర్వే ప్రతి ఏడాది ఉంటుందని చెప్పారు. పీఎల్‌ఎఫ్‌ఎస్ సర్వే కోసం ఎంపిక చేయబడిన గృహాలను సందర్శించామన్నారు. ఈ సర్వే దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్‌ఎస్‌ఓ కర్నూలు ఉప ప్రాంతీయ కార్యాలయం సర్వే సూపర్‌వైజర్ సీ.బీ శ్రీనివాసులు, సర్వే ఎన్యుమరేటర్ నాగన్న, స్థానిక వీఆర్వోలు నర్సరాజు, హనుమంతు, వీఆర్‌ఏలు శ్రీను, సుధాకర్ పాల్గొన్నారు.
నాగంపల్లి సొసైటీ
సీఈఓ అరెస్టు
కొత్తపల్లి: కొత్తపల్లి మండల కేంద్రంలోని నాగంపల్లి సొసైటీ సీఈఓ కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ జయశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. నాగంపల్లి సొసైటీలో 2022 నుంచి కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు సొసైటీ ద్వారా మండలంలోని ఆయా గ్రామాల రైతులు తీసుకున్న రుణాలను వసూలు చేస్తూ, రైతులకు తప్పుడు రశీదులు ఇచ్చారు. నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా దారి మళ్లించాడు. విషయమై ప్రస్తుతం నాగంపల్లి సొసైటీ చైర్మన్‌గా ఉన్న నాగేశ్వరరావు యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని వెల్లడించారు.
హైకోర్టు జడ్జిని కలసిన కలెక్టర్


