వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన స్థానికులు
పెద్దకడబూరు: బతుకుపై విరక్తి చెందిన వృద్ధురాలు కాలువలో దూకిన సంఘటన పెద్దకడబూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు.. మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మి(65) జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశంతో ఆదోని రహదారిలో ఎల్‌ఎల్‌సీ బ్రిడ్జ్ దగ్గర నీళ్లులో దూకింది. నీళ్లులో కొట్టుకొని పోతున్న వృద్ధురాలను చిన్నకడబూరు గ్రామానికి చెందిన దశరథరామరెడ్డి, కనుగొట్ల భీమరెడ్డి గమనించి నీళ్లలో దూకి కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వృద్ధురాలి కుమారుడు, కోడలును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధురాలిని బాగా చూసుకోవాలని చెప్పి వారితో ఇంటికి పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.


