దత్తాత్రేయస్వామికి విశేషపూజలు
శ్రీశైలంటెంపుల్: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద వెలసిన శ్రీదత్తాత్రేయస్వామికి విశేషపూజలను దేవస్థానం అధికారులు, అర్చకులు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం దత్తాత్రేయస్వామికి అభిషేకాది, అర్చనలు చేసి ప్రసాద వితరణ గావించారు.
మిర్చి ధరలు నిరాశాజనకం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది జిల్లాలో మిర్చి దాదాపు 48 వేల ఎకరాల్లో సాగు అయింది. కొద్ది రోజులుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 100 క్వింటాళ్ల వరకు మిర్చి వస్తోంది. అయితే ధరలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. బ్యాడిగ రకానికి రూ.17,869. ఆర్మూర్ రకానికి గరిష్టంగా రూ.14,819. తేజా రకానికి రూ.14,800 ప్రకారం ధరలు లభించాయి. ఈ రకాలకు కనీసం రూ.20 వేల వరకు ధర లభిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఉల్లికి కనిష్టంగా రూ. 536, గరిష్టంగా రూ.1511 లభించింది. వేరుశనగ ధర కనిష్టంగా రూ.5677, గరిష్ఠంగా రూ.7500 ధర లభించింది. కందులకు కనిష్టంగా రూ.4800, గరిష్టంగా రూ.6939 ధర లభించింది. ధరలు పడిపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలగని ‘దారి’ద్య్రం
పత్తికొండ: రాష్ట్రంలో గుంతల లేని రహదారులు ఉంటాయని, సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే వారికి కానుకగా ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక సంక్రాంతి గడిచిపోయి మరికొద్ది రోజుల్లో మరోసారి సంక్రాంతి పండుగ వస్తోంది. అయితే రోడ్ల పరిస్థితి మారలేదు. పత్తికొండ ఆర్‌అండ్‌బీ పరిధిలో గుంతల పడిన రోడ్లులో ప్రయా ణం ప్రమాదకరంగా మారింది. వేలాది మంది రాకపోకలతో ఎల్లప్పుడు రద్దీగా ఉండే పత్తికొండలో రహదారులు సైతం గుంతలపడి ఉన్నాయి.
ఉయ్యాలవాడ: ఈ ఏడాది అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. ఖరీఫ్‌లో మొదట వర్షాభావం, ఆ తర్వాత వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, పత్తి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రబీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మండలంలో 11,076 హెక్టార్లలో పప్పు శనగ సాగు చేశారు. అయితే అధిక వర్షాల కారణంగా భూమిలో తేమ శాతం పెరిగి తెగుళ్లు సోకడంతో శనగ పంట ఎండిపోతోంది. దీనికి తోడు పంటలో కలుపు మొక్కలు అధికంగా పెరగడంతో వాటిని తొలగించేందుకు కూలీల డిమాండ్ పెరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లలో వరుస ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఖరీఫ్‌లో నష్టపోయిన పంటలపై వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా ఇంతవరకు పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. రబీలో మిగిలిన పైరును కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.
దత్తాత్రేయస్వామికి విశేషపూజలు
దత్తాత్రేయస్వామికి విశేషపూజలు


