వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు
● డ్వామా పీడీ వెంకటరమణయ్య
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవచ్చని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. ఇందుకోసం కంపోస్ట్ పిట్‌లు తవ్వుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధి నిధులతో పల్లెపండుగ–2 కింద రూ.20 కోట్లతో పశువుల షెడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4000 ఫాంపాండ్స్ తవ్వాలని లక్ష్యంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల కంపోస్ట్ పిట్‌లు తవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2500 సోప్ పిట్స్ తవ్వాలనేది లక్ష్యమని, రూ.25 కోట్లతో అంతర్గత సిసీ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎంహెచ్‌ఓ’
కర్నూలు(హాస్పిటల్): డయల్ యువర్ డీఎంహెచ్‌ఓ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీ(శుక్రవారం) నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు ప్రజలకు అందని వారు 9849902409 నంబర్‌కు ఫోన్ చేసి వారి సమస్యలను తనకు తెలపవచ్చని పేర్కొన్నారు.
రబీలో టమాటకు మాత్రమే ‘బీమా’
కర్నూలు(అగ్రికల్చర్): రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా(దిగుబడి ఆధారిత బీమా) కింద శనగ, వేరుశనగ, జొన్న, వరి, ఉల్లి పంటలు గుర్తిస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద టమాట నోటిఫై అవుతోంది. ఈ ప్రక్రియ అక్టోబరు నెలలోనే చేపడుతారు. ఇటీవల వాతావరణ ఆధిరత బీమా కింద చంద్రబాబు ప్రభుత్వం టమాట పంటను నోటిఫై చేసింది. మిగిలిన పంటలను పట్టించుకోలేదు. టమాట పంటకు కూడా ఈ నెల 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. హెక్టారుకు రూ.75 వేల విలువకు ప్రీమియం 5 శాతం ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంది. బీమా చేయించుకోవాలంటే హెక్టారుకు రైతులపై రూ.3750 భారం పడుతోంది. మిగిలిన శనగ, వేరుశనగ, జొన్న, వరి, ఉల్లి పంటలకు బీమా ఉంటుందా లేదా అనేదానిపై సమాచారం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాతకందుకూరులో చోరీ
దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరు గ్రామంలో గురువారం చోరీ జరిగినట్లు రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. గ్రామాని చెందిన లక్ష్మిదేవి ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరులో ఉంచిన 5 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదు అహపరించారు. దీంతో బాధితురాలి ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వరకట్నం కేసు నమోదు
కొలిమిగుండ్ల: కల్వటాలకు చెందిన కుమ్మరి మాధురిని వేధించిన కేసులో భర్తపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు గురువారం తెలిపారు. అనంతపురం జిల్లా రంగంపేటకు చెందిన నాగేంద్రతో మాధురితో వివాహమైంది. కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు భార్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
తుగ్గలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా టీడీపీ తుగ్గలి నాయకుడు కె నాగేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం నియామకాలు చేపట్టినట్లు సమాచారం.
యువకుడి దుర్మరణం
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చోటు చేసుకున్న ప్రమాదంలో నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బండి చరణ్ (18) దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అన్న కుమారుడు చరణ్‌తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తాడిపత్రి రూరల్ యూపీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.
వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు


