అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో అక్రమంగా బాలలను తరలిస్తున్న ముఠా సభ్యులను రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలలో ఆరుగురు ముఠా సభ్యులు కొంత కాలంగా బాలలను మాయమాటలతో వస పరుచుకొని ఇతర రాష్ట్రాల వారికి కూలీ పని చేసేందుకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఆరుగురు బాలలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు బాలురలను, ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అంగీకరించారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. చిన్నారులను చిల్డ్రన్ హోంకు తరలించామని సీఐ తెలిపారు.


