ప్రజల నుంచి ఊహించని స్పందన
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి ఉహించని స్పందన వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 15వ తేదీ విజయవాడ కేంద్ర కార్యాలయానికి పంపించే విధంగా చర్యలు చేపట్టాం.
– ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
●


