చలించని పట్టుదల
వారి లక్ష్యం ముందు గజగజ వణికించే చలి సైతం చిన్నబోయింది. వారి పట్టుదలను చూసి మంచు కరిగిపోయింది. వారి కష్టాన్ని మబ్బుల చాటు నుంచి చూసిన భానుడు నులివెచ్చిని కిరణాలు ప్రసరించి శభాష్ అంటూ ప్రోత్సహించాడు. జిల్లాలో రోజురోజకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8 గంటలైనా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులు రోజూ ఉదయాన్నే పాఠశాల ప్రాంగణంలో చలిని లెక్కచేయకుండాస్టడీ అవర్‌లో చదువుకుంటున్నారు. – మహానంది


