వేద పరిమళాలు.. జీవన కిరణాలు !
ధార్మిక సామాజిక హితానికి వేదాభ్యాసం
కర్నూలులో కంచి కామకోటి పీఠం శంకర వేద విద్యాలయం
విద్యార్థులకు ఉచితంగా విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేదాల విద్యను అందిస్తున్న ఏకై క వేద విద్యాలయం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 మంది విద్యార్థులకు వేద విద్యా బోధన
కర్నూలు కల్చరల్: అఖిలమైన ధర్మాలకు మూలం వేదాలే. ‘వేదోఖిలో ధర్మ మూలం’ అను వాక్యంతో ఇది స్పష్టమవుతోంది. అలాగే సకల పురుషార్థాలకు మూల భూతాలు వేదాలేనని రుగ్వేద ప్రాతిశాఖ్య మనకు తెలియజేస్తుంది. ఇటువంటి మహత్తరమైన వేదాలను సంరక్షించుటకు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం ఎంతో కృషి చేస్తోంది. అఖిల భారతీ య బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో కర్నూలు ఓల్డ్‌సిటీలోని శంకర మందిరంలో 2021 ఆగస్టు 13వ తేదీన ఈ వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే చతు ర్వేదాలతో (రుగ్వేదం, యజర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)పాటు రుగ్వేద, యజర ్వేద స్మార్థ విద్యలను అందిస్తోంది. వేద పాఠశాల కరస్పాండెంట్ కె.చిదంబరం, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం డాక్టర్ ఎన్. వేణుగోపాల్, సభ్యులు హెచ్.కె. మనోహర్ వేద పాఠశాల నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేస్తున్నారు.
నాలుగు వేదాలు నేర్పడం ప్రత్యేకం..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ వేద విద్యాలయం తరువాత నాలుగు వేదాలను నేర్పుతున్న ఏకై క విద్యాలయం కర్నూలు శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం. ఇక్కడ వేద విద్య, వసతి, భోజనం సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక వేద విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 75 మంది ప్రస్తుతం వేద అధ్యయనం చేస్తున్నారు. రుగ్వేదం (శాఖల శాఖ)ను 16 మంది అభ్యసిస్తుండగా కరణం శ్రీదత్త శర్మ బోధిస్తున్నారు. రుగ్వేద స్మార్థంను ఐదుగురు అభ్యసిస్తుండగా మేడవరం శ్రీ ప్రణవ శర్మ బోధిస్తున్నారు. కృష్ణ యజుర్వేదం (తైత్తిరీయ శాఖ)ను 17 మంది అభ్యసిస్తుండగా కళ్లే ప్రతాపశర్మ ఈ వేదంను బోధిస్తున్నారు. కృష్ణ యజుర్వేద స్మార్థంను 14 మంది నేర్చుకుంటుండగా, పాలపర్తి శివరామ శర్మ బోఽధిస్తున్నారు. సామవేదం (రాణాయనీయ శాఖ)ను 10 మంది అభ్యసిస్తుండగా, శుభం భగవత్కర శర్మ ఈ వేదాన్ని బోధిస్తున్నారు. అధర్వణ వేదం (శౌనక శాఖ)ను 14 మంది మంది నేర్చుకుంటుండగా కాశీభట్ల పవన శర్మ బోధిస్తున్నారు.
వేద పరిమళాలు.. జీవన కిరణాలు !


