జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్ విద్యార్థులు
సి.బెళగల్: మండల పరిధిలోని కంబదహాల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాఫ్ట్ బాల్ క్రీడలలో ప్రతిభ చాటడంతో జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం రవీంద్ర తెలిపారు. బుధవారం ఆయన వివరాలను తెలిపారు. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అమ్యూల, అజయ్‌లు గుంటూరు జిల్లాలోని మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ – 19 సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా జట్లలతో పాల్గొన్నారని తెలిపారు. క్రీడలలో ప్రతిభ చాటడంతో అమ్యూల, అజయ్ (స్టాండ్ బైగా) జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి నెల 3వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున మహారాష్ట్రలోని నాగాపూర్‌లో జరిగే జాతీయ స్థాయి అండర్ – 19 సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై హెచ్‌ఎం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాసులు (బబ్లు)ను, విద్యార్థులను అభినందించారు.


