సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఊడిపడ్డ పైకప్పు
ఎమ్మిగనూరురూరల్: ఒక ఫైల్ కోసం సబ్ ట్రెజరర్ రఘునందన్ బయటకు రాగానే బుధవారం ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలోని సబ్ ట్రెజర్ క్యాబిన్ పైకప్పు ఊడిపడింది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది కేకలు వేస్తూ భయంతో బయటకు పరుగులు తీశారు. పెచ్చులు ఊడిపడ్డటప్పుడు సబ్ ట్రెజరర్ తన క్యాబిన్‌లో ఉంటే పెనుప్రమాదం సంభవించేంది. ఆయన మీద సిమెంట్ పెచ్చులు పడేవి. సబ్ ట్రెజరర్ రఘనందన్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి కట్టడం అని, పాత భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి పాత భవనానికి మరమ్మతులైనా చేయించాలి, లేదా కొత్త భవనమైన ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.
సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఊడిపడ్డ పైకప్పు


