వరి తినకుంటే.. గడ్డి తింటారా బాబూ!
● సీఎం చంద్రబాబుపై ఏపీ రైతు సంఘం నాయకులు ధ్వజం
కర్నూలు(సెంట్రల్): వరి పంటకు మద్దతు ధర ఇవ్వలేక..వరి తింటే రోగాలు వస్తాయని చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది దారుణమైన విషయమని, వరి తినకుంటే గడ్డి తింటారా అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, సీసీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పంటలకు మద్దతు ధర కోసం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనలో సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలోమహేష్, శ్రీనివాసరావు, బీసన్న, నాగరాజు, నల్లన్న పాల్గొన్నారు.


