జగనన్న కాలనీలో విద్యుత్ మీటర్లు తీసుకెళ్లారు!
మద్దికెర : మండల పరిధిలోని ఎడవలి గ్రామంలోని జగనన్న కాలనీలో ఉన్న 15 మందికి చెందిన విద్యుత్ మీటర్లను తీసుకెళ్లారని ఇంటి యజమానులు బుధవారం విలేకరులకు తెలిపారు. కాలనీలో 40 ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ఇళ్లన్నింటికీ విద్యుత్ అధికారులు మీటర్లు బిగించి వెళ్లారన్నారు. అయితే రెండు రోజు లు క్రితం 15 మందికి చెందిన వారి విద్యుత్ మీటర్లు తీసుకెళ్లారన్నారు. ఈవిషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ రఫీ దృష్టికి తీసుకెళ్లగా మీటర్లు బిగించినపుడు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డులు ఇవ్వలేదని దీంతో వీరిపేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్నారు. అంతేగాక పలుమార్లు తెలిపినా పట్టించుకోక పోవడంతో మీటర్లు తీసుకొచ్చారన్నారు. ఇంటి యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లిస్తే వెంటనే మీటర్లు బిగిస్తామన్నారు.


