చెట్ల కిందే చదువులు!
జెడ్పీ హైస్కూల్‌లో నిలిచి పోయిన గదుల నిర్మాణం
చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల వైపు దృష్టి సారిచడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద చేపట్టిన పాఠశాలల అదనపు గదులు నిర్మాణాలు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. కోసిగి మండలం వందగల్లు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1–10 వతరగతి వరకు 450 మందిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అదనపు గదులు పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు చెట్లకింద చదువుకుంటూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. –కోసిగి


