క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
పగిడ్యాల: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో అసోషియేషన్ చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ క్రీడా మైదానంలో ఖోఖో జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జోనల్ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం లేదని భవిష్యత్ లో ఎంఈఓలు ఈ క్రీడాపోటీల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు సుభాన్, మురళీమోహన్‌రెడ్డి, ఖోఖో అసోషియేషన్ రాష్ట వైస్ చైర్మన్ ప్రభాకర్, నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అసోషియేషన్ అధ్యక్షులు రవికుమార్, జిల్లా అసోషియేషన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, సర్పంచ్‌లు పెరుమాళ్ల శేషన్న, జయపాల్, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు


