● రూ.2.10 కోట్ల నష్టం
పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
ఆదోని అర్బన్: బసాపురం గ్రామ సమీపంలో ఉన్న హరి పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంగళవారం అగ్ని ప్రమా దం జరిగింది. దాదాపు రూ.2.10 కోట్లు విలువ చేసే పత్తి, మిషనరీలు అగ్నికి ఆహుతయ్యాయి. మిల్లులో ఉన్న హమాలీలు, వ్యాపారస్తులు అగ్ని ప్రమాదానికి చూసి వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మిల్లుకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మిల్లులో నలుగురు వ్యాపారులు పత్తిని జిన్నింగ్ చేస్తున్నారన్నారు.శ్రీ గురుసిద్దేశ్వర కాటన్, ఎన్‌డీబీఎల్, శ్రీ వెన్నెల కాటన్స్, శ్రీలక్ష్మీ వెంకటరమణ కాటన్స్ కంపెనీలకు చెందిన పత్తిని జిన్నింగ్ చేసేందుకు వేశారు. మొత్తం రూ.1.50 కోట్లు విలువ చేసే పత్తి, రూ.60 లక్షలు విలువ చేసే జిన్నింగ్ మిషనరీలు అగ్నికి ఆహుతై ఆస్తి నష్టం వాటిల్లిందని కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యజమాని హరి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాపారులు, హమాలీలు అప్రమత్తమై కాటన్ బేళ్లను త్వరితగతిన బయటకు తీసుకొచ్చి నిల్వ చేయడంతో రూ.2 కోట్ల ఆస్తి మిగిలిందని చెప్పారు. కాగా.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక ఇన్‌చార్జి అధికారి రామాంజనేయులు, సీనియర్ లీడింగ్ ఫైర్‌మెన్ రాజారామ్, సిబ్బంది ఇబ్రహీం, ఆనంద్, ఉదయ్‌కుమార్, హోంగార్డు నరసింహులు రెండు ఫైర్ ఇంజన్లతో పరిశ్రమకు చేరుకుని మంటలను ఆర్పి వేశారు.
● రూ.2.10 కోట్ల నష్టం


