రహదారుల మధ్యలో ‘దిమ్మె’
బొమ్మలసత్రం: కలెక్టరేట్‌కు రెండు కిలోమీటర్ల దూరం...ఎస్పీ కార్యాలయానికి 3.5 కిలోమీటర్ల దూరం.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటి ప్రాంతం.. మూడు రహదారుల మధ్య లో వారం రోజులుగా దాదాపు 8 అడుగల చుట్టుకొలతతో 10 అడుగుల దిమ్మె నిర్మాణం జరుగుతోంది. ప్రతి రోజు స్థానిక నేతలు, ఉన్నతాధికారులు ఆ దిమ్మెను దాటి వెళ్తుంటారు. ఎవరికీ ఎందుకు దిమ్మెను నిర్మిస్తున్నారన్న ప్రశ్నరాలేదు. మారుమూల ప్రాంతాల్లో చిన్న ఇంటి నిర్మాణం చేపడితే అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించే మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలవకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నాయకులు అని వదిలేశారో తెలియదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం 2013లో జీవో ఎమ్ ఎస్ నంబర్ 18 ప్రకారం ప్రజా రోడ్లు, కాలిబాటలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతిలేదు. అయితే ఈ ఆదేశాలను పక్కనపెట్టి విగ్రహ ఏర్పాటుచేస్తుండటంపై సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి దిమ్మెను తొలగించాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు దిమ్మె ఏర్పాటు చేస్తున్నారని ఆర్డీవో విశ్వనాథ్‌కు వామపక్ష నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది ఎన్‌హెచ్‌ఏ అధికారుల పరిధిలోకి వస్తుందని, అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు.


