శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల వద్ద స్వామివారి దర్శనానికి బారులుదీరారు. స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లన్న అలంకార దర్శనం భక్తులందరికీ కల్పించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.


