ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన బొజుగు కిషోర్ రూ.11.10 లక్షలు తీసుకుని ఫేక్ లెటర్ ఇప్పించి మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన దీప, కర్నూలు ఆర్మీ ఎన్‌సీసీ క్యాంటీన్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన ఖాశీం వలి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాలాజీ నగర్‌కు చెందిన భారతి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం, శ్రీధర్ తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


