వైభవంగా అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని గుడిపాటిగడ్డలో వెలసిన అయ్యప్పస్వామి దేవస్థానంలో సోమవారం అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ అయ్యప్ప సేవా సమాజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే కన్య స్వాములచే సింగారి మేళ వాయిద్యాలతో చిన్నచెరువు కట్టవద్దకు వెళ్లి గంగాజలాన్ని తీసుకొచ్చారు. ముందుగా మూలవిరాట్‌కు వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి విశేషంగా అభిషేకాలు, తిరుమంజనసేవ చేపట్టారు. సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అఘోరాలు, దేవతల వే‘షధారణలతో అలరించారు. ఈ ఉత్సవంలో అయ్యప్ప నామ స్మరణ మార్మోగింది. అనంతరం స్వామికి అష్టాదశ కలశాన్విత పడిపూజ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమాజ్ సభ్యులు, గురుస్వాములు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం
వైభవంగా అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం


