ఆధ్యాత్మికత పెంపునకు కృషి
చాగలమర్రి: విద్య, వైద్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపునకు ఎస్పీజీ మిషనరీ కృషి చేస్తోందని నంద్యాల అధ్యక్ష కాండపు బిషప్ ప్రసన్నరావు అన్నా రు. సోమవారం ఎంతో చరిత్ర కలిగిన ముతాల్యపాడులోని ఎస్‌పీజీ పరిశుద్ధ జన్మోత్సవ 133వ ప్రతిష్ట వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. అతిథిగా హాజరైన నంద్యాల బిషప్ ప్రసన్నరావు, ఆయన సతీమణి నంద్యాల డయాసిసి ఉమెన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు బ్యాలా సంతోష్‌కు డీనరీ చైర్మన్ రెవ. చంద్రశేఖర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు ఏసుక్రీస్తు సందేశం అందించారు. కార్యక్రమంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ రెవ. నందం ఐజాక్, ట్రెజరర్ రెవ. బండి శామ్యుల్, ఎస్‌ఈజీ ప్రతాప్, ఆళ్లగడ్డ డీనరీ చైర్మన్ ఐజాక్ ప్రసన్నరావు, చర్చి సంఘం పెద్దలు పాల్గొన్నారు.


